మామూలు ప్లాన్ కాదు భయ్యా.. టేబుల్ ఫ్యాన్‌పై సీసీ కెమెరా!

తెలివితేటలు ఒక్కరి సొంతం కాదు అనే మాటని నిజం చేస్తూ, కొందరు తమ వినూత్న ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తుంటారు.

అలాంటి ఓ వ్యక్తి తెలివైన ఐడియాతో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి తన ఇంటి భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే సాధారణంగా గోడకు అమర్చే కెమెరా స్థానంలో, ఇంటి చుట్టూ కవర్ అయ్యేలా ఒకే కెమెరాను వినూత్నంగా ఉపయోగించేందుకు విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

"""/" / దీనికోసం ఆయన టేబుల్ ఫ్యాన్ హెడ్‌ను(Table Fan Head) తీసి, గోడకు ఫిక్స్ చేశాడు.

ఆ తర్వాత ఫ్యాన్‌పై సీసీ కెమెరాను(CC Camera) అమర్చాడు.ఫ్యాన్‌ను ఆన్ చేయగానే కెమెరా అటూ ఇటూ తిరుగుతూ 360 డిగ్రీల కోణంలో పరిసరాలను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది.

ఈ తెలివైన ఆలోచన చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. """/" / ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

"ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అందు కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో.

, ఇలాంటి ఆలోచనలు మాకెందుకురావని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరేమో.

మీ ఆలోచన సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఫన్నీ ఎమోజీలతో సైతం రియాక్షన్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్‌ను సాధించి వైరల్‌గా మారింది.

ఈ సరికొత్త ఆలోచన భద్రతా చింతనతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తోంది.

నేటి డిజిటల్ యుగంలో ఇలాంటి విభిన్న ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.