ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్ కాదు- ఎల్లారెడ్డిపేట లోని ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్యాంపస్

మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద 8.

50 కోట్లతో నిర్మించిన స్కూల్.రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రభుత్వ పాఠశాలలు అనగానే నాలుగు భవనాలు, ఖాళీ గ్రౌండ్, సౌకర్యాల లేమి ముందుగా గుర్తొస్తుంది.

అది గతం.స్వరాష్ట్రం తెలంగాణ లో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారాయి .

అందుకు సిరిసిల్ల గీతా నగర్ జడ్పీహెచ్ఎస్ ,గంభీరావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ , తాజాగా ఎల్లారెడ్డిపేట జడ్.

పి.హెచ్.

ఎస్ క్యాంపస్ .ఎల్లారేడిపేట సర్కారు బడిని చూస్తే షాకవ్వాల్సిందే.

ఇంటర్నేషనల్ స్కూలేమో అనిపిస్తుందంటే ఆశ్చర్యం లేదు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల అందరి కళ్లకు చూడముచ్చటగా కనిపిస్తోంది.

ఈ మేరకు గత సంవత్సరం ఏప్రిల్‌ 23న మన ఊరు మనబడి కార్యక్రమం కింద సీఎస్‌ఆర్‌ నిధులతో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేశారు ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన ఈ పాఠశాలలో అంగన్‌వాడీ స్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకునేలా అద్భుత సముదాయాన్ని నిర్మించారు.

8.50 కోట్లతో పూర్తయిన పాఠశాలలో సకల వసతులు కల్పించారు.

విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు క్రీడామైదానం, గ్రంథాలయం, ప్రయోగశాలలు నిర్మించారు.కాగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు .

సకల వసతులు పాఠశాలలో 48 కంప్యూటర్లతో మోడల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు అనువైన డైనింగ్‌ హాల్‌ నిర్మించారు.

బాలురు, బాలికలు, సిబ్బందికి వేరువేరు టాయిలెట్లు, కిచెన్‌షెడ్లు, ఫిల్టర్‌ వాటర్‌ ప్లాండ్లు, డిజిటల్‌ బోర్డులు, రన్నింగ్‌ వాటర్‌, హ్యాండ్‌వాష్‌ సౌకర్యం కల్పించారు.

ఫిజికల్‌, బయోసైన్స్‌ ల్యాబ్‌లు ఇదివరకే ఉన్నప్పటికీ మరిన్ని వనరులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

పెరుగుతున్న అడ్మిషన్లు అద్భుతమైన పాఠశాల భవనం, నిపుణులైన బోధన, బోధనేతర సిబ్బంది, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడడంతో తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే పక్క మండలాల నుంచి కూడా వస్తున్నారు.రెండు రోజుల నుంచి ఉన్నత పాఠశాలలో 80, ప్రాథమిక పాఠశాలలో 40 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతోనే మన ఊరు మన బడి కార్యక్రమం కింద మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో ఈ ఎల్లారెడ్డిపేట ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటైంది .

అంగన్వాడీ నుంచి పదో తరగతి వరకు చదువుకునేలా సముదాయం ఉంది .అధునాతన కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లు, ఆధునిక క్రీడా ప్రాంగణం, మోడల్ డైనింగ్ హాల్, విశాలమైన తరగతి గదులు.

ఇలా సకల వసతులతో కార్పొరేట్ కు దీటుగా ఉంది .విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం.

ప్రభుత్వ బడుల రూపు రేఖలు ఎట్లా మారాయో ,మారబోతున్నాయో అనే దానికి సింబల్ ఈ ఎడ్యుకేషన్ క్యాంపస్ చూడముచ్చటగా ఉంది .

అనురాగ్ జయంతి , జిల్లా కలెక్టర్ ప్రవేశాలకు పోటీ పడుతున్నారు .పాఠశాలను అన్ని రకాల వసతులతో నిర్మించారు.

మొన్న ప్రకటించిన టెన్త్‌ ఫలితాల్లో 10 జీపీఏ సాధించాం.పాఠశాల పరిసరాలు, ఫలితాలను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రవేశాలకు పోటీ పడుతున్నారు .రోజురోజుకూ అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి.

దబ్బెడ హన్మాండ్లు, హెచ్‌ఎం, ఎల్లారెడ్డిపేట స్కూల్‌.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !