పొత్తులు కాదు ఒంటరి పోరే ! ప్రకటించేసిన ‘ బండి ‘ 

రాబోయే తెలంగాణ( Telangana ) సర్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఎవరికి వారు సొంతంగా ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూ,  జనాల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి  వచ్చి,  బలమైన పార్టీగా ఉన్న బీఆర్ ఎస్ ను ఓడించేందుకు బిజెపిల తో పాటు, మరెన్నో పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే విడివిడిగా ఎన్నికలకు వెళ్తే బిఆర్ఎస్( BRS ) ను ఓడించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో పొత్తులతో  ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

దీనికి తోడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ),  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు ఫోన్ చేశారు.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో పాటు,  నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదాం అంటూ ప్రతిపాదన తెచ్చారు.

ఈ క్రమంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయని ప్రచారం జరిగింది.దీనిపై తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

ఎన్నికల్లో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోవడం లేదని,  ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి బీఆర్ఎస్ ను ఓడిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు.

ఏ సర్వేలు చూసినా, తెలంగాణలో బిజెపి జెండానే ఎగురుతుందని రిపోర్టులు వస్తున్నాయని సంజయ్ అన్నారు.

"""/" / వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండదని,  బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయని సంజయ్ అన్నారు చివరకు కేసీఆర్ చేయించిన సర్వే కూడా బిజెపి దే విజయం అని తేల్చిందని అన్నారు.

పాలించమని కేసీఆర్ కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఉన్న పరిశ్రమలు మూతపడే స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు.

బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే.. కమల్ హాసన్ కంటే ఎక్కువేనా?