ఇండస్ట్రీ గురించి కాదు బ్రో మూవీ గురించి మాత్రమే..: మంత్రి అంబటి

మెగాస్టార్ చిరంజీవి అంటే గౌరవంతో పాటు ప్రత్యేక అభిమానం ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

బ్రో సినిమాలో తన గురించి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయడం కాదా అని నిలదీశారు.

తనను గోకినందుకే తాను గోకానంటూ మంత్రి అంబటి విమర్శించారు.తమ్ముడు తనవాడైనా అన్నయ్య ధర్మం మాట్లాడాలని సూచించారు.

తాను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడటం లేదన్న మంత్రి అంబటి బ్రో సినిమా గురించి మాత్రమే మాట్లాడతానని పేర్కొన్నారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రెమ్యూనిరేషన్ ఎంతో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి5, ఆదివారం 2025