ఇప్పటివరకు నాన్నకు వచ్చిన ఒక్క అవార్డు కూడా ఇంట్లో లేదు: రామ్ చరణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఒక పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా మొన్నటి వరకు టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన వ్యక్తి.

కానీ ఒకే ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.అందుకు కారణం రాజమౌళి.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.

ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించాడు.

ఇలా ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి.

"""/" / ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ పాట ఆస్కార్ నామినేషన్ కి కూడా సెలెక్ట్ అవటం భారతీయులకు గర్వంగా ఉంది.

మార్చి 12వ తేదీన లాస్ ఏంజెల్స్ జరిగే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో ఈ పాటకు అవార్డు రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా యూనిట్ లాస్ ఏంజెల్స్ చేరుకుంది.ఈ క్రమంలో రాజమౌళి, రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

టాక్‌ ఈజీ పాడ్‌క్యాస్ట్‌లో హోస్ట్‌ సామ్‌ ఫ్రాగోసోతో మాట్లాడిన రామ్‌చరణ్‌ తన ప్రొఫెషనల్‌ లైక్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"""/" / ఈ క్రమంలో తన తండ్రి చిరంజీవి గొప్పతనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాన్న సినిమాల్లో మెగాస్టార్‌ అయినప్పటికీ ఆయన నీడలో మేం ఉండకూడదని, మాకంటూ సొంత గుర్తింపు ఉండాలనే తాపత్రయపడ్డాడు.

ఆయన స్టార్డం మా దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.అందుకే తనకు వచ్చిన అవార్డులను ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి కింద ఉన్న ఆఫీస్ లో పెట్టుకున్నాడు.

మమ్మల్ని ఒక స్టార్‌ కిడ్స్‌గా కాకుండా సాధారణ పిల్లలుగానే పెంచాడు.ఆయన ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి సులభంగా అడుగు పెట్టొచ్చన్న ఆలోచనను మాకు రానీయలేదు.

ఆయన పెంపకం వల్లే నేనిలా ఉన్నాను.నా ఈఎమ్‌ఐలు నేను సవ్యంగా కట్టుకోగలుగుతున్నానంటే అది నాన్న చలవే అని చిరంజీవి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఏ భార్యను ఏ భర్త కూడా ఇంతలా టార్చర్ పెట్టి ఉండడు.. కానీ కమల్ హాసన్ చేసాడు..!