నార్వే డ్యాన్సర్లు అంటే ఆమాత్రం ఉంటుంది.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపారుపో
TeluguStop.com
కార్యక్రమం ఏదైనా ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటారు ప్రతి ఒక్కరు.పుట్టిన రోజు, పెళ్లి వేడుక సహా ఇతర శుభకార్యాల్లో ఫన్ ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
ఈ మధ్య కాలంలో పెళ్లి పీటలెక్కాల్సిన పెళ్లి కూతుళ్లు కూడా డ్యాన్సులతో దుమ్ము లేపుతున్నారు.
ఫేమస్ సాంగ్ సెలక్ట్ చేసుకుని ఆ బీట్‌కు తగ్గట్లు స్టెప్పులు వేస్తూ వేదిక చేరుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో నార్వేకు చెందిన కొంత మంది డ్యాన్సులు తెగ వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే వారు బాలీవుడ్‌కు చెందిన పాటలకు తమ స్టైల్ స్టెప్పులు వేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.
తాజాగా మరో డ్యాన్స్ తో ఇరగ దీశారు.ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న క్విక్ స్టైల్ అనే నార్వేరియన్ డ్యాన్స్ కళాకారుల బృందం పాటకు కాలు కదుపుతూ అందరి ఆకట్టుకున్నారు.
అబ్బాయిలంతా గ్రూప్ గా ఏర్పడి బాలీవుడ్ సినిమా తన వెడ్స్ మనులోని సాలి గాలి పాటకు నృత్యం చేశారు.
ఎనర్జటిక్ స్టెప్పులతో ఆహూతులను అలరించారు.దీనికి కొనసాగింపుగా మరో వీడియో విడుద చేయగా.
అది కూడా సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసిన ఈ డ్యాన్స్ వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ అయింది.
నార్వే దేశానికి చెందిన ఈ డ్యాన్సర్ల స్టెప్పులు నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది.లక్షల వ్యూస్, అదే సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.
నవంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ.. వామ్మో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదా?