ఆ విమర్శలపై నోరుమెదపని రేవంత్.. ఆందోళనలో అభిమానులు

కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నాయని చెప్పొచ్చు.

గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పదునైన విమర్శలు చేస్తూ కేడర్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ దిశా నిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించి పార్టీని రాజకీయ అధికారం వైపుగా నడిపిస్తారని భావిస్తున్నాయి.

అయితే, రేవంత్ చీఫ్‌గా నియామకం తర్వాత కార్యకర్తలు, శ్రేణుల్లో జోష్ వచ్చిన మాట వాస్తవమే.

ఇకపోతే రేవంత్ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీపైన దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి గద్దె దింపడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దళిత గిరిజన దండోరాను నిర్వహిస్తున్నారు.అయితే, రేవంత్ ఈ విమర్శలపై మాత్రం నోరు మెదపడం లేద అవేంటంటే.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన టీఆర్ఎస్‌లోకి వెళ్లిన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి అందరికీ విదితమే.

ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ శ్రేణులు, నేతలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటాక్ చేశారు.గతంలో ఓటుకు నోటు కేసులో డబ్బులతో పట్టుబడిన దొంగవైన నువ్వు పార్టీ మార్పు గురించి, ఎమ్మెల్యేల రాజీనామా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శిచారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు రేవంత్ సేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

"""/"/ అధికార పార్టీ చేసే ప్రతీ విమర్శపై స్పందించి కాంగ్రెస్ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేయాల్సిన రేవంత్ తనపై వచ్చిన విమర్శనపైనా స్పందించపోవడంలో మతలబేంటి? అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఇకపోతే ఇప్పటి వరకు రేవంత్ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేయగా, కేటీఆర్ విమర్శలకు స్పందించకపోవడం గమనార్హం.

ఫ్రీ.. ఫ్రీ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అప్పటి నుంచే..