కిమ్ ప్రజలకే కాదు భార్యకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టాడు.ఇంతకీ అవేంటో తెలుసా?

నియంతల నేలైనా నార్త్ కొరియా లో ప్రస్తుత పాలకుడు కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తన తాత,తండ్రి కంటే అతి పెద్ద నియంతలా వ్యవహరిస్తున్న కిమ్ అక్కడి ప్రజలను రాచి రంపాన పెడుతున్నాడు.

భూమి మీద ఇలాంటి వాడిని ఎవరూ భరించలేరు ఒక రిసై జూ తప్ప… ఇంతకీ ఈ రిసైజు ఎవరంటే కిమ్ భార్య.

కిమ్ తన దేశప్రజలకే కాదు తన భార్యకు కూడా బోలెడన్ని నిబంధనలు పెట్టాడు అవేంటో ఇప్పుడు చూద్దాం… రిసైజు వృత్తి రీత్యా సింగర్ ఈమె కిమ్ ను వివాహం చేసుకున్నాక తనకిష్టమైన సింగింగ్ కెరియర్ ను వదిలేయాల్సి వచ్చింది.

పాపం కిమ్ ను చేసుకోవడం వల్ల రిసైజు తన గుర్తింపును కోల్పోయింది.వివాహం అనంతరం కిమ్ అతని భార్య పేరును రిసైజుగా మార్చాడు.

అలాగే ఆమె గతానికి చెందిన విషయాలన్నిటిని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచాడు.ఇప్పటికీ ఈమెకు సంబంధించిన జననం,తల్లిదండ్రుల వివరాలు వంటివి ఖచ్చితంగా ఎవరికీ తెలియవు.

"""/"/ ఇక పెళ్ళైన నాటి నుండి రిసైజు తన తల్లిదండ్రుల్ని కలవడానికి వీలులేకుండా చేశాడు కిమ్.

రిసైజు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ఎవరూ కలవకుండా,తను ఎవరని చూడకుండా దాదాపు ఆమెను ఒక బందీలా ఉంచాడు కిమ్.

కిమ్ ప్రవర్తన తెలిసిన ఆ దేశ ప్రజలు రిసైజు బయట కనపడకపోవడంతో తనని కిమ్ చంపేశాడని అనుకున్నారు.

రిసైజు కిమ్ తో తప్ప ఒంటరిగా బహిరంగ సభలకు వెళ్ళడం కాని లేదా అక్కడి ప్రజలను కలవడం కాని రెండు నిషేదం.

రిసైజు తన ప్రతి పుట్టినరోజు నాడు కిమ్ తాత,తండ్రి విగ్రహాల వద్ద పూలు వేసి వారిని స్మరించుకొని రావాలి.

ఇక నార్త్ కొరియాలో నడిచే పత్రికా సంస్థలన్నీ కిమ్ కనుసన్నలలో నడుస్తుంటాయి.వాటికి కిమ్ ఒక వింత ఆదేశాన్ని ఇచ్చాడు.

అదేంటంటే నార్త్ కొరియా ఫస్ట్ లేడీ రిసైజు తనతో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను తప్ప ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను ప్రచురితం చేయకూడదు.

ఒకవేళ అలా చేస్తే కిమ్ ఏం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పురాణాల్లో అయినా ప్రస్తుత సమాజంలోనైనా దాదాపు పతివ్రత మూర్తులందరూ రాక్షసుల భార్య లగానే ఉంటారు.

బాలీవుడ్ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా..?