అణుయుద్ధంపై కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు.. ఆ దేశాలకు హెచ్చరిక

అమెరికా-దక్షిణ కొరియా ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.వీటిపై ఉత్తరకొరియా( North Korea ) నియంత కిమ్ జోంగ్ ఉన్( Kim Jong Un ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ రెండు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికా, దక్షిణ కొరియా ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని, ప్రపంచాన్ని "అణుయుద్ధం అంచుకు"( Nuclear War ) పెంచుతున్నాయని ఆరోపించారు.

అమెరికా ( America ) హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇప్పటికే పలుమార్లు ఉత్తరకొరియా అణు పరీక్షలు చేపట్టింది.

కిమ్ జోంగ్ ఉన్ సారథ్యంలో అమెరికా లక్ష్యంగా ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు చేపట్టింది.

దీనిపై అమెరికా ఆక్షేపణలు వ్యక్తం చేసినా కిమ్ పట్టించుకోలేదు.అయితే తన సరిహద్దులో దక్షిణ కొరియాతో కలిసి ప్రయోగాలు చేపట్టడంతో ఒక్కసారిగా అణుయుద్ధం ప్రస్తావన తీసుకొచ్చి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశారు.

"""/" / మార్చి నుండి వార్షిక సైనిక విన్యాసాలను అమెరికా-దక్షిణ కొరియా దళాలు నిర్వహిస్తున్నాయి.

ఇందులో భాగంగా అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు బీ-1బీ, బీ-52 బాంబర్లను అమెరికా ప్రదర్శించింది.

అంతేకాకుండా వైమానిక విన్యాసాలు, సముద్ర తలంలో విన్యాసాలు దక్షిణ కొరియాతో పాటు చేపట్టింది.

ఇలాంటి కసరత్తులను దండయాత్రకు రిహార్సల్‌గా ఉత్తర కొరియా భావిస్తోంది.మరో వైపు ఉత్తరకొరియా గత సంవత్సరం రికార్డు స్థాయిలో అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది.

"""/" / ఇటీవలి వారాల్లో సైనిక కార్యకలాపాలను వేగవంతం చేసింది.ఇది కొత్త, చిన్న అణు వార్‌హెడ్‌లను ఆవిష్కరించింది.

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి - హ్వాసాంగ్ 17తో పాటు అభివృద్ధి దశలో ఉన్న అణు సామర్థ్యం గల నీటి అడుగున ప్రయోగించే డ్రోన్‌ను పరీక్షించింది.

జలాంతర్గామి నుంచి క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించింది.తమ శత్రు దేశాలకు కఠినమైన హెచ్చరికలు పంపింది.

కిమ్ దూకుడు చూసిన వివిధ దేశాలు అతడి తీరుపై ఆందోళనగా ఉన్నాయి.ఏ మాత్రం అణు యుద్ధాన్ని కిమ్ ప్రారంభిస్తే అది క్రమంగా వివిధ దేశాలకు పాకి, ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నాయి.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!