హెడ్ కానిస్టేబుల్ అత్యుత్సహం…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాచేపల్లి అరవింద్ అత్యుత్సాహం శాఖా పరమైన చర్యలకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన దాచేపల్లి అరవింద్ నూతనకల్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే సొంత ఊరు లింగాల వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అవమానపరిచే విధంగా పోస్తులు పెట్టారు.
దీనితో గ్రామస్తులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.పోలీస్ శాఖలో పని చేస్తూ రాజకీయ పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పోలీస్ శాఖ క్రమశిక్షణ తప్పినందుకుగాను సదరు హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి వేడుకలు… ఫోటోలు వైరల్!