ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వరుడు మర్మాంగం కోసిన దుండగులు....
TeluguStop.com
ప్రస్తుత కాలంలో మనుషులు కోపోద్రిక్తులై ఎంతకైనా తెగిస్తున్నారు.అంతేగాక క్రూరులై ప్రవర్తిస్తూ కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు.
తాజాగా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి శోభనం జరగకుండా పెళ్లయి 24 గంటలు గడవకుండానే వరుడి మర్మాంగాన్ని కోసేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఇక రాష్ట్రంలోని సైదాపూర్ గ్రామంలో నూర్ ఆలంఅనే ఓ యువకుడు నివసిస్తున్నాడు.
అయితే నూర్ మరియు ఇదే ప్రాంతానికి చెందిన అటువంటి ఓ యువతి ప్రేమించుకున్నారు.
దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని పెళ్లి చేయమని తమ పెద్దలకు తమ ప్రేమ విషయం తెలిపారు.
అయితే ఇందుకు నూర్ ఇంటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.దీంతో తన కుటుంబ సభ్యుల్ని ఎదిరించి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. """/"/
తమ ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో నూర్ తన అత్తమామల ఇంటికి వెళ్ళాడు.
అయితే పెళ్లి జరిగిన రోజు రాత్రి సమయంలో తన అత్తగారి ఇంటి నుండి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో దుండగులు నూర్ ను అడ్డగించి కత్తితో తీవ్రంగా గాయపరిచారు.
అంతేకాక అతడి మర్మాంగాన్ని కోసేసి పరారయ్యారు.ఇది తెలుసుకున్న పలువురు స్థానికులు చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే తీవ్ర రక్త స్రావమై రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి నూర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.
అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితుడి భార్య తెలిపిన టువంటి వివరాల ఆధారంగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన యూకే యువకుడు.. అతని మృతి వెనక ఎన్నో సందేహాలు..