నూడుల్స్ తినటం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

ఈ రోజుల్లో ఇన్ స్టెంట్ ఆహారాలు ఎక్కువగా వాడటం జరుగుతుంది.ఇప్పుడు మారిన జీవనశైలి,బిజీ లైఫ్ లో సమయం లేకపోవటం వలన కూడా ఇన్ స్టెంట్ ఆహారాల మీద ఆధారపడటం ఎక్కువ అవుతుంది.

అంతేకాక పిల్లలు కూడా అటువంటి ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు.అలాంటి ఆహారాలలో నూడుల్స్ ఒకటి.

నూడుల్స్ అంటే పిలల్లకే కాదు పెద్దవారికి కూడా ఇష్టమే.నూడుల్స్ చేయటం చాలా తేలిక.

అయితే నూడుల్స్ తినటం అనేది ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ నూడుల్స్ తయారిలో నూనెను ఎక్కువగా వాడతారు.అంతేకాక కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఉండుట వలన షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

నూడుల్స్ లో ఎటువంటి ప్రోటీన్స్,మినరల్స్ ఉండవు.కాబట్టి జంక్ ఫుడ్ గా భావించాలి.

నూడుల్స్ లో ఉపయోగించే పిండి కారణంగా మలబద్దకం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ నూడుల్స్ తయారీ సరిగా లేకపోతే పొట్టలో అసౌకర్యం ఏర్పడి అజీర్ణ సమస్యలు వస్తాయి.

నూడుల్స్ తినాలని అనుకున్నప్పుడు వాటిని తయారుచేసేటప్పుడు ఆకుకూరలు,బీన్స్,బఠాణి వంటివి వేస్తె ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది.

మీరు నాన్ వెజ్ తినేవారు అయితే నూడుల్స్ తయారు చేసినప్పుడు గుడ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా వేసుకోవచ్చు.

నూడుల్స్ రోజువారీ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందువల్ల వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కూరలతో కలిపి చేసిన నూడుల్స్ తింటే మంచిది.

లండన్ ఇప్పుడు భారతీయులదేనా.. షాకింగ్ రిపోర్ట్ వైరల్..