నూడుల్స్ ప్రియులు ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు!

ప్రస్తుత రోజుల్లో అంతా ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు.ముఖ్యంగా నూడుల్స్‌ను( Noodles )పిల్లలు, పెద్దలు లొట్టలు వేసుకుంటూ తింటుంటారు.

దీని కోసం సాయంత్రం కాగానే వీధి వ్యాపారుల వద్దకు క్యూ కడుతుంటారు.నూడుల్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, రుచి కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నూడుల్స్‌ను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.

ఈ రోజుల్లో నూడుల్స్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన తర్వాత నూడుల్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు తినడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

అందరినీ షాక్‌కు గురి చేసే ఆ వీడియో గురించి తెలుసుకుందాం. """/" / ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువ మంది తినడానికి ఆసక్తి చూపేది నూడుల్స్.

చైనాలో పుట్టిన ఈ నూడుల్స్ రుచికి ప్రపంచం అంతా ఫిదా అయ్యారు.తక్కువ సమయంలోనే వండుకునే వంటకం కావడంతో దీని వైపు చాలా మంది మొగ్గు చూపుతుంటారు.

ముఖ్యంగా మ్యాగీ, యిప్పీ తదితర బ్రాండెడ్ నూడుల్స్‌తో పాటు వీధి వ్యాపారుల వద్ద కూడా ఎంతో ఇష్టంగా నూడుల్స్‌ను ప్రజలు తింటుంటారు.

వీధి వ్యాపారుల వద్ద వండే నూడుల్స్‌ను చౌ మెయిన్ నూడుల్స్‌గా పిలుస్తారు.ఇక నూడుల్స్‌కు సంబంధించి వైరల్ ( Viral )అవుతున్న వీడియోను పరిశీలిస్తే, నది ఒడ్డున కొందరు వ్యక్తులు ఉంటారు.

ఆ సమయంలో ఒక వ్యక్తి తన చేతిలో ప్లాస్టిక్ ట్రేను పట్టుకుని నది వద్దకు వెళ్తాడు.

"""/" / నదీ నీటిలో ఆ ప్లాస్టిక్ ట్రేను ముంచుతాడు.మామూలుగా అతడు ఏదో ముంచుతున్నాడని ఎవరైనా అనుకుంటారు.

అయితే పరిశీలించి చూస్తే బుట్టలో మనకు నూడుల్స్ కనిపిస్తాయి.ఇలా నదిలో పారే నీటిలో నూడుల్స్ కడిగాడు.

అనంతరం వాటిని వండి కసమర్లకు వడ్డించాడు.ఉడికించిన తర్వాత వ్యాపారులు ఇలా నూడుల్స్‌ను చల్లని నీటిలో కడుగుతుంటారు.

ఒకదానికొకటి అంటుకోకూడదని వారి ఉద్దేశం.అయితే అపరిశుభ్ర నీటిలో కడగడమే కొంచెం ఆందోళనకరం.

దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అవుతోంది.

నూడుల్స్‌కు గంగా నదిలో స్నానం చేయిస్తున్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?