చంద్రబాబు కుప్పంకు నాన్ లోకల్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com

చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్.కుప్పంకు నాన్ లోకల్ అని సీఎం జగన్ అన్నారు.


చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


కుప్పంకు ఆయన ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు కానీ,.ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉందన్నారు.
కుప్పం ప్రజలకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు.
అనంతరం బీసీలకు చంద్రబాబు చేసిన న్యాయం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు.కుప్పం నుంచి మొదలు పెడితే బీసీలకు ప్రతి చోటా అన్యాయమే చేశారన్నారు.
ఇక్కడ నుంచి పోటీ చేయాల్సింది బీసీలేనన్న ఆయన.చంద్రబాబుకు కుప్పంపై ఉన్నది కపట ప్రేమ అని ఆరోపించారు.
కుప్పం నియోజకవర్గం తనదన్న సీఎం జగన్.అభివృద్ధి కూడా తనదేనని హామీ ఇచ్చారు.
రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్