సీనియర్ సినీనటి పై నాన్-బెయిలబుల్ వారెంట్

సినీ నటి,బీజేపీ నేత జయప్రదకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తుంది.

గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లఘించారన్నది ప్రధాన ఆరోపణ నేపథ్యంలో ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది యూపీ రాంపూర్ కోర్టు.

2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సినీ నటి జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియామావళిని అతిక్రమించారంటూ ఆమెపై కేసు నమోదైంది.

ఈ క్రమంలో ఆమె పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2019 లో జరిగిన రాం పూర్ పార్లమెంటరీ నియాజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన జయప్రద సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ ఆమెపై లక్షా పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు.

దీనితో జయప్రద ఓటమి పాలయ్యారు.అయితే ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు అంటూ ఆమె పై కేసు నమోదు కాగా దానికి కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అయితే ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది.

అయితే ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది.

అలానే జయప్రద కూడా అజమ్ ఖాన్ పై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తుంది.

ఆ ఎన్నికల సమయంలో బహిరంగ సభలో పాల్గొన్న అజమ్ ఖాన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?