రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

రాజ్యసభ వైసీపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌.

కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు.

నలుగురూ నామినేషన్లు దాఖలు చేశారు.ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

అనంతరం విజయసాయిరెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తామన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామన్నారు.వైసీపీ బలం 9కి చేరిందని, 9 మంది ఎంపీల్లో ఐదుగురు బీసీ వర్గాలకు చెందినవారని పేర్కొన్నారు.

ఇది బీసీ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శమన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కీలకమన్నారు.

దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.

అల్లు అర్జున్ టీ గ్లాస్ స్టెప్పు పై అనసూయ షాకింగ్ కామెంట్స్!