తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే నామినేషన్ల జాతర..!
TeluguStop.com
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అయింది.ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే నామినేషన్ల జాతర మొదలు కానుంది.
ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు నామినేషన్ల ప్రక్రియ( Nominations ) ప్రారంభం కానుంది.
అదేవిధంగా ఏపీ అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఇటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) రేపు నోటిఫికేషన్ వెలువడనుంది.
కాగా రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు.
ఈ నామినేషన్లకు ఈ నెల 25వ తేదీ వరకు తుది గడువు ఉండగా.
ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుంది.అలాగే ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
ఈ క్రమంలోనే మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే.. శ్రీలీల చెప్పిన షాకింగ్ సీక్రెట్స్ వైరల్!