కడప ఎంపీ అభ్యర్థిగా వివేక హత్య కేసులో మరో నిందితుడు నామినేషన్..!!

దివంగత వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో మొదటి నిందితుడు దస్తగిరి( Dastagiri ) ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

"జై భీమ్" పార్టీ తరఫున పులివెందుల బరిలో నిలిచారు.ఇదిలా ఉంటే ఇదే కేసులో మరో నిందితుడు శివ శంకర్ రెడ్డి( Shiva Shankar Reddy ) కడప లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో శివశంకర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఏపీలో మరో మూడు వారాలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీల నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.

ఏపీలో అనేక పార్టీలు ఉన్నాగాని ప్రధానంగా వైసీపీ వర్సెస్ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి మధ్య పోటీ నెలకొంది.

"""/" / 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలు( 2024 Elections ) చాలా పోటాపోటీగా ఉన్నాయి.

ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద హత్య కేసు సంచలనం సృష్టించింది.

2019 ఎన్నికలకు ముందు.వైయస్ వివేకానంద హత్య చేయబడ్డారు.

అప్పటినుండి ఇప్పటివరకు విచారణ కొనసాగుతూనే ఉంది.ఈ కేసును ఆధారం చేసుకుని అనేక పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా వివేక హత్య కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో.

ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన తీసుకురావద్దని కడప కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఈ హత్య కేసులో నిందితుడు శివ శంకర్ రెడ్డి.

కడప ఎంపీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగటం సంచలనంగా మారింది.

తల్లి కూరగాయల వ్యాపారి.. సీఏ పాసైన కొడుకు.. ఈ యువకుడి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!