నల్లగొండ జిల్లా: నామినేషన్ల ప్రక్రియ( Nominations Process ) ప్రారంభమైన తొలి రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్దులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
తొలి నామినేషన్ మల్లిడి వెంకటరామ్ రెడ్డి( Mallidi Venkataram Reddy ),రెండో నామినేషన్ ధనావత్ ఉషా నాయక్ తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చెన్నయ్యకు అందజేశారు.
దీంతో తొలిరోజు మిర్యాలగూడ -88 నియోజకవర్గం( Miryalaguda Constituency )లో రెండు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
నామినేషన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఇరువైపులా డిఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
100 మీటర్ల దూరంలో భారీ కేడ్లను ఏర్పాటు చేసి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాలను దారి మళ్లించారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హరిబాబు, సిఐలు రాఘవేందర్, నరసింహారావు, సత్యనారాయణ,ఎస్సైలు నరసింహులు,శివతేజ, శీను నాయక్,తబిత, రాంబాబు,కృష్ణయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, తదితరులు విధులు నిర్వహించారు.
బార్‌టెండర్ అద్భుత ఆవిష్కరణ.. వేసవిలో ఫ్రిడ్జ్ లేకున్నా డ్రింక్స్ చల్లగా.. ఎలాగో మీరే చూడండి!