అమాంతం పెరిగిన నోబెల్ విజేతల ప్రైజ్ మనీ…!

ప్రస్తుతం కరోనా వైరస్ నిబంధనల కారణంగా అనేక కార్పొరేట్ సంస్థల నుండి చిన్న చిన్న వ్యాపార సంస్థల వరకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అవసరం ఉన్నా లేకున్నా ఉద్యోగుల జీతాలను కోతలు పెట్టడం, మరికొందరిని ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటివి చేస్తున్నాయి పలు కంపెనీలు.

ఇలాంటి సమయంలో ప్రస్తుత పరిస్థితికి విభిన్నంగా నోబెల్ బహుమతి అందుకునే వారికీ ప్రైస్ మని భారీగా పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు నోబెల్ ఫౌండషన్.

ఒక రంగానికి సంబంధించి అంతర్జాతీయంగా పలు రంగాలలో కృషి చేసిన ప్రతిభావంతులకు ఇచ్చే నోబెల్ పురస్కారానికి సంబంధించి నగదు బహుమతి పై నోబెల్ ఫౌండేషన్ కీలక ప్రకటన తెలియజేసింది.

ఇక ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఇస్తున్న ప్రైజ్ మనీకి మరో ఒక మిలియన్ క్రౌన్స్ ను పెంచుతున్నట్లు గా తెలిపింది.

ఇప్పటివరకు నోబెల్ బహుమతి విజేతలకు 9 మిలియన్ క్రౌన్స్ ను బహుమతిగా అందజేస్తున్న నోబెల్ ఫౌండేషన్ తాజాగా మరో మిలియన్ క్రౌన్స్ లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోయే గ్రహీతలు ఇకనుంచి 10 మిలియన్ క్రౌన్స్ ను ప్రైస్ మనీ గా అందుకోబోతున్నారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ ఫౌండేషన్ గుర్తించి పురస్కారాన్ని అందజేస్తారు.

ప్రపంచంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా చెప్పుకునే బహుమతి నోబెల్ బహుమతి.1910వ సంవత్సరంలో ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ బహుమతి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ఇక ఇందుకు సంబంధించి మొదట్లో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులకు ఒకటిన్నర లక్షల క్రౌన్స్ లను ఇచ్చేవారు.

ఇక వారికి 2000 సంవత్సరంలో ఈ ప్రైజ్ మనీని 10 మిలియన్ క్రౌన్స్ గా చేయగా 2008లో ఆర్థిక మాంద్యం సంక్షోభం కారణంగా ఆ ప్రైజ్ మని ని 8 మిలియన్ క్రౌన్స్ కు తగ్గించారు.

తాజాగా మళ్లీ 10 మిలియన్ క్రౌన్స్ ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది.

10 మిలియన్ క్రౌన్స్ అంటే మన భారతదేశ కరెన్సీలో ఏకంగా 3 కోట్ల రూపాయలు.

చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది – బాలకృష్ణ