మ్యాచ్ ను కీలక మలుపు తిప్పిన నోబాల్.. రాజస్థాన్ ఘోర ఓటమి..!

తాజాగా రాజస్థాన్ - హైదరాబాద్( Rajasthan - Hyderabad ) మధ్య సాగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

అయితే రాజస్థాన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ.చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు బౌండరీలు బాదడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగి హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.

అంతేకాదు హైదరాబాద్ జట్టు విజయానికి ముఖ్య కారణం ఏమిటంటే చివరి బంతి నోబాల్ కావడమే.

"""/" / ఆఖరి ఓవర్ లో హైదరాబాద్ జట్టు 17 పరుగులు చేయాల్సి ఉండగా.

సందీప్ శర్మ( Sandeep Sharma ) ఆఖరి ఓవర్ లో నోబాల్ వేసి మ్యాచ్ ఫలితాన్ని మార్చి, జట్టు కొంప ముంచేశాడు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

జోస్ బట్లర్ 95, సంజూ శాంసంగ్ 66, యశస్వి జైస్వాల్ 35 పరుగులతో భారీ స్కోరు చేశారు.

"""/" / లక్ష్య చేదన కు దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచి మంచి ఆట ప్రదర్శన చేసింది.

జట్టు ఓపెనర్ లైన అన్ మోల్ ప్రీత్ సింగ్ ( An Mol Preet Singh )33, అభిషేక్ శర్మ 55 పరుగులతో అద్భుతమైన ఓపెనింగ్ అందించారు.

రాహుల్ త్రిపాఠి పరుగులతో మంచి ఇన్నింగ్స్ అందించాడు.హెన్రిక్ క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ ఏడు బంతుల్లో 25 పరుగులు చేశారు.

మ్యాచ్ చివర్లో అబ్దుల్ సమ్మర్( Abdul Samar ) 7 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేసి హైదరాబాద్ జట్టుకు విజయం అందించాడు.

ఈ మ్యాచ్ లో ఓటమిపై సంజూ శాంసంగ్ స్పందిస్తూ.ఇలాంటి మ్యాచ్లు ఐపీఎల్ లో చాలా స్పెషల్.

చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో అస్సలు ఊహించలేం.తనకు సందీప్ పై పూర్తి నమ్మకం ఉందని, నో బాల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని తెలిపాడు.

ఈ ఐదు రకాల ఆహారాలు డైట్ లో ఉంటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు!