ఒక్క ఫైట్ సీన్ కు 32 వేల లీటర్ల కూల్ డ్రింక్ వేస్ట్!

సినీ ప్రియులకు జేమ్స్ బాండ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హాలీవుడ్ మూవీస్ లో జేమ్స్ బాండ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఈ సిరీస్ లో ఉండే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

గత కొంతకాలం నుంచి ఎంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం 25వ జేమ్స్ బాండ్ చిత్రంగా క్యారీ జోజి దర్శకత్వంలో ‘నో టైమ్‌ టు డై’ రూపొందుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలోని ఒక యాక్షన్ సన్నివేశాన్ని ఇటలీలో చిత్రీకరించారు.ఈ ఫైట్ సీన్ కోసం చిత్రబృందం ఏకంగా 32 వేల లీటర్ల కూల్ డ్రింక్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

కేవలం ఈ ఒక్క సన్నివేశం కోసమే సుమారు యాభై లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

"""/"/ జేమ్స్ బాండ్ సిరీస్ అంటే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు.అంతగా యాక్షన్ సన్నివేశాలను ఆస్వాదించే ప్రేక్షక అభిమానుల కోసం చిత్రబృందం ఏ స్థాయిలో అయినా ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే గత నాలుగు చిత్రాల్లో జేమ్స్ బాండ్ గా నటించిన డేనియల్‌ క్రేగ్‌ ఈ సినిమాలోనూ గూఢచారిగా నటిస్తున్నారు.

దాదాపు 2 వేల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అమెరికాలో ఘోర ప్రమాదం : పల్టీలు కొడుతూ, చెట్టుపై ఇరుక్కుపోయిన కారు .. ముగ్గురు భారతీయుల దుర్మరణం