కేశినేనికి క‌లిసిరాని త‌మ్ముళ్లు.. ఒంట‌రిపోరేనా ?

కేశినేనికి క‌లిసిరాని త‌మ్ముళ్లు ఒంట‌రిపోరేనా ?

బెజ‌వాడ టీడీపీలో త‌మ్ముళ్ల ఆధిప‌త్య పోరు ప‌తాక స్థాయికి చేరింది.ముఖ్యంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత కూడా నాయ‌కుల మ‌ధ్య స‌మైక్య‌త క‌నిపించ‌డం లేదు.

కేశినేనికి క‌లిసిరాని త‌మ్ముళ్లు ఒంట‌రిపోరేనా ?

కార్పొరేష‌న్ రేసులో ముందున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌.మేయ‌ర్ అభ్య‌ర్థిగా కూడా ప్ర‌చారంలో ఉన్నారు.

కేశినేనికి క‌లిసిరాని త‌మ్ముళ్లు ఒంట‌రిపోరేనా ?

అయితే.త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కేశినేనికి ఇత‌ర నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ చాలా పెరిగింది.

ఆయ‌న పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేయడంతోపాటు.కీల‌క నేత‌గా ఉన్న విజ‌య‌వాడ టీడీపీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ.

బుద్ధా వెంక‌న్న ను టార్గెట్ చేశారు.అదేస‌మ‌యంలో ఇత‌ర నేత‌లను కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు.

ముఖ్యంగా వంగ‌వీటి రాధా, బొం డా ఉమా వంటి నాయ‌కుల‌ను కూడా ప‌క్క‌న పెట్టారు.

ఈ ఎఫెక్ట్ బాగానే క‌నిపిస్తోంది.మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కుషెడ్యూల్ విడులైన వెంట‌నే ప్ర‌చారం ప్రారంబించిన కేశినేని త‌న కుమార్తె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార్డుల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు.

తానే స్వ‌యంగా జెండా చేత‌ప‌ట్టి ప్ర‌చారంలోకి దిగారు.అయితే.

ఆయ‌న వెంట కీల‌క నేత‌లు ఎవ‌రూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.అయితే.

మీడియాను స‌మీక‌రించి.త‌న వాయిస్ వినిపించే ప్ర‌య‌త్నం చేశారు.

"""/"/ ఎట్టి ప‌రిస్థితిలోనూ టీడీపీని గెలిపిస్తామ‌ని పేర్కొన్నారు.కానీ, క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్ల‌ను క‌లుపుకొని పోక‌పోతే.

గెలుపు ఎలా ? అనే విష‌యంపై మాత్రం మౌనం పాటించారు.త‌న కుమార్తెను మేయ‌ర్ చేయ‌డం అంటే.

అంద‌రినీ క‌లుపుకొని పోవాల్సిన అవ‌స‌రం ఉంది.కానీ, కేశినేని నాని త‌న పంథాను మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మార్చుకోలేదు.

ప్ర‌చారానికి ఈ నెల చివ‌రి వ‌ర‌కు అవ‌కాశంఉన్న నేప‌థ్యంలో మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న అంద‌రినీ క‌లుపుకొని పోతారో లేదా? అనేది సందేహం గా ఉంది.

ఇక‌, మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇక్క‌డ కీల‌క పాత్ర పోషిస్తార‌ని తెలుస్తోంది.

ఈయ‌న‌కు కేశినేని నానికి మ‌ద్య చాలా విభేదాలు ఉన్నాయి.వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.

కేశినేనికి క‌లిసి వ‌చ్చే త‌మ్ముళ్లు ఎంత‌మంది? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్యను సెలెక్ట్ చేసే అవకాశాలు.. ఆ టీం వర్క్ చేయనుందా?