ఒక్క పోస్ట్ లేకుండానే @2 మిలియన్ ఫాలోవర్స్.. పవర్ స్టార్ మానియా ఇది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈయన స్టార్ హీరోలందరి కంటే లాస్ట్ లో ఇంస్టాగ్రామ్( Instagram ) అకౌంట్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ ఇంస్టాగ్రామ్ లేదు.

అయితే తాజాగా పవన్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టాడు.ఎటువంటి పోస్ట్ కానీ హంగామా కానీ లేకుండానే పవన్ ఎంట్రీ స్టార్ట్ అయ్యింది.

అయినప్పటికీ పవన్ మానియా మాములుగా లేదు.ఈయన ఎంత సైలెంట్ గా వచ్చిన పవర్ స్టార్ క్రేజ్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ లోనే చూపిస్తుంది.

చడీ చప్పుడు లేకుండా వచ్చినప్పటికి పవర్ స్టార్ అప్పుడే 20 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించు కున్నాడు.

ఒక్క పోస్ట్ కూడా ఈ అకౌంట్ లో పెట్టక పోయిన పవన్ ను అభిమానించే వారంతా ఫాలోవర్స్ గా మారిపోయారు.

"""/" / దీంతో పవర్ స్టార్ సింగిల్ పోస్ట్ కూడా లేకుండా 2 మిలియన్ ఫాలోవర్స్ ను( 2 Million Followers ) సాధించిన ఏకైక ఇండియన్ సెలెబ్రెటీగా రికార్డ్ క్రియేట్ చేసాడు.

దీంతో పవర్ స్టార్ మాస్ క్రేజ్ దీనికి నిదర్శనం అనే చెప్పాలి.కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) షూట్ లో పాల్గొన్నాడు.

"""/" / ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూట్ ఇప్పుడు జరుపు కుంటుంది.

ఈ సినిమాను హరీష్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఈయన లైనప్ లో హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు ఉన్నాయి.

అలాగే పవన్ కళ్యాణ్ కీ రోల్ లో నటించిన 'బ్రో' మూవీ( Bro Movie ) జులై 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.