సీబీఐ విచారణలో పురోగతి లేదుః సుప్రీంకు వైఎస్ వివేకా కుమార్తె
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణ ధర్మాసనం పర్యవేక్షణలో జరగాలని పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.
సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు.నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారన్నారు.
ఈ కారణంగానే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగించాలని ఆమె కోరుతూ పిల్ దాఖలు చేశారు.