TDP Seniors : తొలి జాబితాలో టీడీపీ సీనియర్లకు దక్కని చోటు..!!

ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) రానున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది.

ఈ మేరకు 118 అభ్యర్థులతో టీడీపీ - జనసేన తొలి జాబితాను ప్రకటించింది.

వీరిలో 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రకటించారు.

అయితే ఈ ఫస్ట్ లిస్టులో పార్టీలోని సీనియర్ నేతలకు చుక్కెదురు అయింది. """/" / పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాస రావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బండారు సత్యనారయణ మూర్తి, మండలి బుద్ధప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తొలి జాబితాలో చోటు దక్కలేదు.

అయితే తొలి జాబితాపై సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary ) స్పందించారు.

టికెట్ ఎవరికీ ఇచ్చినా పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

దేవర మూవీ రెమ్యునరేషన్ల లెక్కలు మీకు తెలుసా.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?