ఇతర జిల్లాల ప్రయాణాలపై ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!

గత రెండు నెలలుగా లాక్ డౌన్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండడం తో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది.

అయితే తాజాగా సడలించిన లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రయాణం చేయవచ్చు అని,ఇరు రాష్ట్రాల అనుమతి తీసుకుంటే ఈ ప్రయాణం సులువేనని స్పష్టం చేశారు.

అయితే ఒకే రాష్ట్రంలో ఉన్న వారు కూడా ఇతర జిల్లాలకు వెళ్ళడానికి పోలీసుల వద్ద పిటీషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

వారి అనుమతి తీసుకున్నాకే ఇతర జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు తాజాగా ఏపీ ప్రజలకు లాక్‌డౌన్ నిబంధనల నుంచి ఊరట కలిగించారు ఆ రాష్ట్ర పోలీసులు.

ఇక నుంచి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్ళాలి అంటే ఎలాంటి అనుమతి లేకుండా తిరగొచ్చని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

ప్రయాణికులను తనిఖీల పేరుతో ఆపకూడదని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.పొరుగు జిల్లాలకు వెళ్లాంటే ఎలాంటి అనుమతి పత్రాల కోసం ధరఖాస్తు అవసరం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే రూల్స్ ను మాత్రం అతిక్రమించకూడదు అని స్పష్టం చేశారు.కారులో ప్రయాణం చేసే వారు ముగ్గురుకి మించి ఉండకుండా చూడాలని, అదే విధంగా ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు.

ఇక రెడ్, ఆరెంజ్ జోన్,కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయని తెలిపారు.మరోవైపు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అనుమతి తప్పనిసరిగా పేర్కొన్నారు.

ఎవరైనా ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్ళేవారికి మాత్రమే పోలీసులు పాస్‌లు జారీ చేస్తామన్నారు.ప్రభుత్వ విధి నిర్వహణ, సామాజిక పనులు, ఎవరైనా బంధువుల మరణాలు, హాస్పిటల్ పనులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని,ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే ఈ ఈ-పాస్ లు అనేవి దరఖాస్తు చేసుకోవాలి అని స్పష్టం చేశారు.

ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నవారు.https:citizen.

Appolice.gov!--in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, కాగా నిబంధనలు సడలించినా రాత్రి సమయాల్లో మాత్రం కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించారు.

ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ సూచనలు తప్పకుండా పాటించాలి అని డీజీపీ తెలిపారు.

వైరల్ వీడియో: వెరైటీగా కనపడ్డ రాయి.. తవ్వి చూడగా ఏకంగా..