30 ఏళ్లు నిండితే గానీ ఈ యూఎస్ రెస్టారెంట్‌లో నో పర్మిషన్..??
TeluguStop.com
యునైటెడ్ స్టేట్స్( USA )లోని కొన్ని రెస్టారెంట్లు వినూత్నమైన ఆలోచనలతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటాయి.
అయితే ఇటీవల అలాంటి ఒక రెస్టారెంట్ సోషల్ మీడియా( Social Media )లో హాట్ టాపిక్ గా మారింది.
మిసౌరీలోని ఫ్లోరిసాంట్ సిటీలో బ్లిస్ అనే ఒక రెస్టారెంట్ ఉంది.ఈ రెస్టారెంట్‌లో కరీబియన్ ఫుడ్ ( Caribbean Food)కోదాడ దొరుకుతుంది.
అయితే రెస్టారెంట్‌లో ఫుడ్ తినాలంటే 30 ఏళ్ల నిండి ఉండాల్సిసిందే.సాధారణంగా ఏ రెస్టారెంట్ అయినా చిన్న పిల్లలతో సహా అందరిని అనుమతిస్తుంది కానీ అన్నింటికీ భిన్నం.
"""/" /
ఎవరిని రెస్టారెంట్ లోకి అనుమతిస్తామో చెప్పే ఓ కూడా వారు ముందే తగిలించారు.
ఈ చిత్రమైన రూల్ ఇప్పుడు చర్చలకు దారి తీసింది.సాధారణంగా బార్లు, రెస్టారెంట్లు 18 లేదా 21 సంవత్సరాల వయసు పైబడిన వారిని మాత్రమే అనుమతిస్తాయి.
కానీ, బ్లిస్ రెస్టారెంట్ ( Bliss Restaurant )వారి వయసు పరిమితిని నిర్ణయించింది.
రెస్టారెంట్ లోకి వచ్చే మహిళలు కనీసం 30 సంవత్సరాలు, పురుషులు కనీసం 35 సంవత్సరాలు పైబడి ఉండాలని వారు నియమం పెట్టారు.
ఇలా చేయడం వల్ల రెస్టారెంట్ లో వాతావరణం మెరుగ్గా ఉంటుందని, కస్టమర్లు ఫ్యాషన్ గా, రొమాంటిక్ గా ఉంటారని వారు నమ్ముతున్నారు.
"""/" /
ఈ రూల్‌ను ఆన్‌లైన్‌లో కొంతమంది సమర్థిస్తున్నారు.చిన్న వయసు వారు ప్రజా ప్రదేశాలలో తరచుగా సమస్యలు సృష్టిస్తారని కాబట్టి పెద్దవారి కోసమే ప్రత్యేక రెస్టారెంట్ ఉండటం మంచిదే అని అంటున్నారు.
అయితే, చిన్న వయసు వారైన కుటుంబ సభ్యులతో రావడం కుదరదు కాబట్టే ఇది చెత్త నిర్ణయం అని మరి కొంతమంది అన్నారు.
30 లేదా 35 సంవత్సరాలు దాటిన వారంతా మంచి ప్రవర్తన కలిగి ఉంటారని కూడా చెప్పలేమని కామెంట్లు చేశారు.
వయసును బట్టి కాకుండా ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో దానిపై దృష్టి పెట్టాలని వారు వాదించారు.
ఒక వ్యక్తి ఎందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరు వయసు పరిమితి విధించారని ప్రశ్నించారు.
"నా ఫియాన్సే నా కంటే పెద్దవారు, కానీ 35 సంవత్సరాలు నిండలేదు కాబట్టి, ఫియాన్సేతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లలేను వయసు పరిమితి ఆలోచనను బాగున్నా, అది అందరికీ ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు.
" అని ఒకరు కామెంట్ చేశారు.
బ్రేక్ ఇన్స్పెక్టర్ పై తిరగబడ్డ లారీ డ్రైవర్లు.. వీడియో వైరల్