ఆ కుక్కని పెంచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు.. కానీ అదే రూ.లక్ష గెలుచుకుంది!

ఇక్కడేకాదు, ప్రపంచంలో ఎక్కడైనా కుక్కని తమకి ఇష్టమైన పెట్ లాగా పెంచుకుంటూ వుంటారు.

ఎందుకంటే అది విశ్వాసంలో మనిషిని మించిపోతుంది.అలాగే చిన్నపిల్లలు కూడా వాటిని అమితంగా ఇష్టపడుతుంటారు.

ఫారిన్ కంట్రీలో అయితే ఇంటకొక కుక్కపిల్ల పెంచుతారు.అలాంటిది ఆ కుక్కని ఎవరు ఎందుకు పెంచుకోవడానికి ఇష్టపడారంటే, అది కొన్ని రోగాలతో బాధపడుతోంది.

చూడటానికి అందవిహీనంగా ఉంటుంది.అయితే దానికి ఒకరు దత్తత తీసుకున్నారు.

ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.అమెరికా కాలిఫోర్నియాలో ప్రతియేటా అసహ్యమైన కుక్కల పోటీ జరుగుతుంది.

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా జరిగింది.దాంట్లో అరిజోనాకు చెందిన 17ఏళ్ల చివావా మిక్స్ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైన కుక్కగా ఎంపికైంది.

ఎందుకంటే ఆ కుక్క ముఖమంతా కణతులు ఉన్నాయి.అలాగే నరాల సంబంధిత వ్యాధితో నిలబడలేని అత్యంత దీనావస్థలో ఉంది.

దీంతో దాని యజమాని జెనెడా బెనెల్లి లక్ష రూపాయలు గెలుచుకుంది.అయితే, ఇక్కడ ఓ బాధాకరమైన వార్త తెలిసింది.

అదేమంటే ఈ కుక్క మరో నెల రోజులు మాత్రమే బతుకుతుందని జెనెడా తెలిపింది.

"""/" / కాలిఫోర్నియాలో ఈ పోటీ దాదాపు 50 ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.

గత రెండు సంవత్సరాలు అక్కడ ఆ పోటీ జరగలేదు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ పోటీ తాజాగా జరిగింది.

ఈ శునకానికి దంతాలు లేవు, అలాగే జుట్టు కూడా పెద్దగా లేదు.బయటకి చూడటానికి ఓ “హైనా” లాగా కనిపిస్తోంది.

నిద్రపోవడం, గురక పెట్టడం, సంతోషంగా ఉన్నప్పుడు శబ్దాలు చేయడం ఆ కుక్క హాబీస్ అని ఆ కుక్క యజమాని అయినటువంటి జెనెడా తెలిపింది.

ఈ పోటీలో విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతి రావడం విశేషం.అంతేకాకుండా న్యూయార్క్ సిటీ ట్రిప్ అవకాశం కూడా లభించింది.

Nallamilli Ramakrishna Reddy : మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిని బుజ్జగిస్తున్న టీడీపీ..!!