సీఏఏ వలన ఎవరికీ నష్టం లేదు..: ఎంపీ లక్ష్మణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ప్రధాని కావాలని ప్రజల్లో కనిపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) అన్నారు.

అయితే ఒక వర్గానికి సీఏఏ వ్యతిరేకమని చిదంబరం చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

సీఏఏ వలన ఎవరికీ నష్టం లేదని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఏఏను కాంగ్రెస్ వాడుకుంటోందని విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.

అవినీతి కూటమి రాహుల్ గాంధీని నాయకుడిగా ఒప్పుకోవడం లేదన్నారు.కాంగ్రెస్ ఇంకా గాంధీ కుటుంబం చేతిలోనే బందీ అయిందని విమర్శించారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని లక్ష్మణ్ తెలిపారు.ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Rajasingh ) పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నానని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వదిలి.. కుంభమేళా బాట పట్టిన మేధావి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!