పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు: కేంద్రం
TeluguStop.com
పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది.రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానం ఇచ్చింది.
డ్యామ్ ఎత్తు 41.15 మీటర్లతో నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.
10,911.15 కోట్లు అవసరం అవుతాయని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులకు మరో రూ.2 వేల కోట్లు అవసరం అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మొత్తం నిధుల కోసం గత కేబినెట్ నిర్ణయాన్ని సవరిస్తూ మళ్లీ కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుందని వెల్లడించారు.
మీ పిల్లలు మొబైల్ కు ఎడిక్ట్ అయ్యారా.. అయితే వారిని ఇలా డైవర్ట్ చేయండి!