సీబీఐ నుంచి నోటీస్ రాలేదు.. వైఎస్ భాస్కర్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

విచారణలో భాగంగా అధికారులు కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించారు.ఈ క్రమంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందాయన్న వార్తలు వచ్చాయి.

దీనిపై వైఎస్ భాస్కర్ రెడ్డి స్పందించారు.తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు.

విచారణ విషయమై మీడియాలో చూసి సీబీఐ ఎస్పీకి ఫోన్ చేశానన్నారు.కానీ ఆయన నుంచి ఎటువంటి రిప్లై రాలేదని స్పష్టం చేశారు.

అదేవిధంగా ఒకవేళ నోటీసులు అందినా ఈనెల 24 తర్వాత అందుబాటులో ఉంటానని ఇంతకు ముందే చెప్పానని వెల్లడించారు.