కండ్లకలకతో భయపడాల్సిన అవసరం లేదు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: కండ్లకలక ఇన్ఫెక్షన్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదం ఏమీ లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti) పేర్కొన్నారు.

అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పారు.కండ్లు ఎర్రబడటం,నీరుకారడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

చికిత్సలో వినియోగించే కంటిచుక్కలు, ఆయింట్మెంట్లు, అవసరమైన మందులను సిరిసిల్ల జిల్లా( Sirisilla District ) ఆసుపత్రి తో పాటు వేములవాడ ఏరియా ఆసుపత్రి, జిల్లాలోని అన్ని సిహెచ్ సి ,పీహెచ్‌సీ దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

పలు జిల్లాల్లో కండ్లకలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా వైద్యాధికారి తో ఫోన్ లో మాట్లాడారు.

కండ్లకలక( Conjunctivitis ), సీజనల్‌వ్యాధుల అప్రమత్తతపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.

కండ్లకలక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇన్ఫెక్షన్‌ సోకిన వారిని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గుర్తించి సమీప దవాఖానల్లో చికిత్స అందేలా చూడాలని సూచించారు.

గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత గురించి అవగాహన పెంచాలని చెప్పారు.ఇన్ఫెక్షన్‌ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, వారు వాడిన టవల్స్‌, బెడ్‌షీట్స్‌, కర్చీఫ్‌, దిండ్లు వంటివి ఇతరులు వినియోగించకపోవడం వల్ల వ్యాప్తిని నివారించవచ్చని చెప్పారు.

H3 Class=subheader-styleకండ్లకలక లక్షణాలు ఇవే: /h3p కండ్లు ఎర్రబడటం, నీరు కారడం,వాపు రావడం H3 Class=subheader-styleవ్యాప్తి నివారణ :/h3p ఇన్ఫెక్షన్‌ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, వారు వాడిన టవల్స్‌, బెడ్‌షీట్స్‌, కర్చీఫ్‌, దిండ్లు వంటివి ఇతరులు వినియోగించకపోవడం.

ఆ సమయంలో చనిపోతానని అనుకున్నా.. మనీషా కోయిరాలా కామెంట్స్ వైరల్!