ఎన్నికల సరళిపై ముకేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ జరిగింది.ఈసారి ఓటర్లు ఎక్కువ శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్కడ రీ పోలింగ్( Re-Polling ) అవసరం లేదని స్పష్టం చేశారు.సాయంత్రం 6 గంటల తర్వాత 3500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కొనసాగిందని పేర్కొన్నారు.

ఓటర్ల నమోదు( Voter Registration ) ముందుగా చేపట్టడంతో భారీగా పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో చిన్నచిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

"""/" / అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి.

మాచర్ల, పుంగనూరు, పల్నాడు ఘటనలపై చర్యలు తీసుకున్నాం అని అన్నారు.పల్నాడులో 8 బూత్ లలో ఈవీఎంలు( EVM ) ధ్వంసం చేశారు.

డేటా మొత్తం సేఫ్ గా ఉంది అని స్పష్టం చేశారు.ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు' అని ముకేశ్ కుమార్ వివరించారు.

పరిస్థితి ఇలా ఉండగా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే.ప్రతిపక్షాలకు విజయవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు.

గతంలో ఈ రకంగానే ఓటింగ్ నమోదైన సమయంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాయని చెబుతున్నారు.

తాజా ఓటింగ్ శాతంతో ఈసారి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది ఆసక్తికారంగా మారింది.

సినిమాల్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన రంభ.. ఆ ఆశ మాత్రం నాకు లేదంటూ?