ఇప్పటికీ అక్కడ బాహుబలి 2 రికార్డ్స్ సేఫ్… ఏ సినిమాను బ్రేక్ చేయలేకపోతోందిగా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు ఎస్.ఎస్.

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) , అనుష్క(Anushka ) జంటగా నటించిన చిత్రం బాహుబలి (Bahubali) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రమైనటువంటి బాహుబలి 2(Bahubali 2)భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ప్రతి ఒక్క ఏరియాలోను అద్భుతమైన రికార్డులను సృష్టించింది.

అయితే ఈ సినిమా హిందీలో అత్యంత మెజారిటీతో కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా హిందీలో సాధించిన రికార్డులను ఇప్పటివరకు ఏ సినిమా కూడా అక్కడ బీట్ చేయలేకపోయింది.

"""/" / గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలను చవి చూస్తున్నటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీకి షారుఖ్ ఖాన్(Shahrukh Khan) సినిమాలో కాస్త ఊపిరి పోస్తున్నాయి.

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఇకపోతే ఈ సినిమా కూడా బాహుబలి 2 రికార్డ్స్ సాధించలేకపోయింది.

తాజాగా వచ్చిన జవాన్(Jawan Movie) సినిమా కూడా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టలేకపోయింది.

మరి ఇప్పటివరకు హిందీలో ఉన్నటువంటి బాహుబలి 2 రికార్డ్స్ ఏంటి అనే విషయానికి వస్తే.

"""/" / బాహుబలి 2 సినిమా సాధించిన రికార్డ్స్ ఏంటి అనే విషయానికి వస్తే.

దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కువ టికెట్స్ అమ్మడయిన రికార్డ్ ఇప్పటికి కూడా బాహుబలి 2 పేరు మీదే ఉంది.

ఈ సినిమా విడుదలకు ముందు దాదాపు 6 లక్షల 50 వేలకు పైగా అడ్వాన్స్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

ఈ టికెట్స్ రికార్డ్ ను ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు.

జవాన్ సినిమా అయినా బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఈ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది.

దీంతో బాహుబలి రికార్డ్స్ సేఫ్ గా ఉన్నాయని చెప్పాలి.

మరిగే నీటితో ఐస్ చేయాలనుకుంది.. చివరికి ఏమైందో చూస్తే వణుకు పుడుతుంది!