ఇకపై అక్కడ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్’ అనరట… మరి ఏమని పిలుస్తారంటే…!?

మామూలుగా ఎక్కడైనా కొన్ని కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా అందరిని డియర్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అంటూ సంబోధిస్తూ ఉంటారు.

ఇలాంటివి ఎక్కువ ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ లకు వెల్కమ్ చెబుతూ ఎయిర్లైన్స్ సంస్థ వారు సంబోధిస్తారు.

అయితే ఇక నుండి జపాన్ దేశంలో మాత్రం డియర్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించకూడదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఇక ఆ దేశంలో లేడీస్, జెంటిల్ మెన్ అనే మాటలు వినపడవు.

మరి లేడీస్, జెంటిల్ మెన్ అని పిలవకపోతే మరి ఎలా పిలుస్తారు అని అనేగా మీ ఆలోచన.

మామూలుగా ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న సమయంలో లింగం, వయసు, జాతి, ప్రాంతీయ భేదం లాంటివి కనపడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఇందులో భాగంగానే ఎయిర్ లైన్స్ లో ఉపయోగించే లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అనే పదాలు లింగ వివక్ష చూపించే విధంగా ఉన్నాయని అక్కడి ప్రభుత్వం వాటిని సంబోధించవద్దని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

అయితే, ఇందుకు ప్రత్యామ్నాయంగా వారి దేశంకి వచ్చిన ప్రయాణికులను ' ఎవరీ వన్ ' లేదా ' ఆల్ ప్యాసింజర్స్ ' అని మాత్రమే పిలవాలని ఎయిర్ లైన్స్ అధికారులకు ప్రభుత్వం నుండి సంకేతాలు వచ్చాయి.

ఇలా మారడానికి గల కారణం ఎయిర్ లైన్స్ లో ప్రయాణం చేసే వారిలో కేవలం ఆడవారు, మగవారు మాత్రమే కాకుండా థర్డ్ జెండర్స్ కూడా ప్రయాణిస్తుంటారని.

అలాంటి సమయంలో లేడీస్ అండ్ జెంటిల్ మెన్ అనే సంబోధన వారికి వర్తించకపోవడం ద్వారా వారు అసంతృప్తి పొందుతారన్న నేపథ్యంలో అధికారులు ఈ విషయంలో మార్పులు చేశారు.

ఇలా లింగ విభేదం చూపే పదాలను కేవలం ఎయిర్ లైన్స్ లో మాత్రమే కాకుండా జపాన్ దేశం మొత్తం కూడా ఇలానే ఫాలో అవ్వాలని ప్రభుత్వం సూచించింది.

జపనీస్ సొంత భాషలో కూడా ఇప్పటికే లింగభేదం తెలిపే పదాలను ఆ ప్రభుత్వం బ్యాన్ చేసింది.

ఇక ఇప్పుడు మిగతా భాషల్లో కూడా లింగభేదం సూచించే పదాలను వారి దేశంలో అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది.

చొక్కాలను చింపుకొని మరీ బాదుకున్న వ్యాపారస్తులు… దేనికోసం అంటే?