చేతిలో చిల్లిగవ్వ లేదు… అద్దె కట్టలేం: టైమ్ స్క్వేర్ వీధుల్లో న్యూయార్క్ వాసుల నిరసనలు

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది.రోజుకు వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తూ, మరణ మృదంగాన్ని మోగిస్తోంది.

అక్కడ కోవిడ్ 19 కారణంగా ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం న్యూయార్క్.ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్థిరపడాలని భావించే నగరం న్యూయార్క్.

అందుకే ఇక్కడ కొలువుల కోసం రెక్కలు కట్టుకుని అమెరికా పరిగెడుతుంటారు.చిన్నపాటి ఉద్యోగం దొరికినా సరే వదలకుండా చేసుకుంటూ పోతుంటారు.

కరోనా కారణంగా ఇప్పుడు పరిస్ధితి అంతా రివర్స్ అయ్యింది.న్యూయార్క్‌లో ఇప్పటి వరకు 3,19, 213 మందికి కరోనా సోకగా, 24,368 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆర్ధిక రంగం కుదేలవ్వడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.లాక్‌డౌన్ విధించడం, ఉపాధి కోల్పోవడం, ఉద్యోగాలు లేక అంతా ఇంటికే పరిమితమవ్వడంతో ప్రజలను ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

మే 1న అందరూ ఇంటి అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో న్యూయార్క్‌ వాసులు మే డే రోజున రోడ్లెక్కారు.

"""/"/ " నో మనీ, నో రెంట్" అంటూ నినాదాలు చేశారు.ఉద్యోగుల హక్కులను కాపాడాలని, ఆర్ధికంగా ఆదుకోవాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కరోనా కారణంగా ఇంటి అద్దెలు చెల్లించలేకున్నామని.ఇంటి అద్దెల రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

ప్రజల ఆందోళనలకు ప్రతిపక్షనేతలు కూడా మద్ధతు పలికారు.ఇదే సమయంలో ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ట్రంప్ ప్రకటించిన ప్యాకేజ్‌లు ఏమయ్యాయనే చర్చ మొదలయ్యింది.

మరోవైపు తమకు ఆర్ధిక రంగం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో.

ప్రజలకు నిరసన వ్యక్తపరిచే హక్కు ఉందని.కానీ అదే సమయంలో మరొకరి ఆరోగ్యానికి హానీ కలిగించే హక్కు లేదని స్పష్టం చేశారు.

కాగా అమెరికాలో శనివారం ఒక్కరోజే 28,400 కేసులు నమోదవ్వగా.మొత్తం కేసుల సంఖ్య 11,59,430కి చేరింది.

శనివారం 1,638 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 67,391కి చేరింది.--.

‘హెలికాప్టర్ ‘ కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ?