టీడీపీ వాళ్లు ఎంత మంది వచ్చినా వైసీపీని ఏం చేయలేరుః కొడాలి నాని
TeluguStop.com
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వస్తున్న ఆరోపణలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గోరంట్ల చెబుతున్నా.సిగ్గు లేకుండా టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారని విమర్శించారు.
వీడియో ఫేక్ అని పోలీసులు చెబుతున్నా.టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
గోరంట్ల వీడియో అంటూ ఆ విషయాన్ని పట్టుకుని వేలాడినా.వైసీపీని గానీ, జగన్‌ను గానీ టీడీపీ ఏమీ చేయలేదని ఆయన అన్నారు.
తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరంటూ ఎద్దేవా చేశారు.
సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!