ఎన్ని జన్మలెత్తినా కొత్తపల్లి గ్రామ ప్రజల రుణాన్ని తీర్చుకోలేను

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కొత్తపల్లి, రాజుపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన కేకే మహేందర్ రెడ్డి ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ గత ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 95% ఓట్లు తనకు మద్దతుగా కొత్తపల్లి గ్రామంలో పడడం జరిగిందని నేటికీ నేను చరిత్రను మరిచిపోలేదని గుర్తు చేశారు.

గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అన్న కెసిఆర్ ఈరోజు రాష్ట్రాన్ని తన కబంధహస్తాలలో పెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని ఆరోపించారు.

కేవలం తన అనుచర గణాన్ని దోచుకోవడానికి ప్రజల మీదకు దండయాత్ర లాగా పంపించడం జరిగిందని తెలిపారు.

పక్కనే తొమ్మిదవ ప్యాకేజీ కింద ఉన్న ఎగువ మానేరు పూర్తి కాలేదు కానీ 11 12 13 ప్యాకేజీల కింద ఉన్న మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తయ్యాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వంట గ్యాస్ ధర 500 రూపాయలకే అందిస్తుందని,తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని,ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల నగదును అందిస్తుందని అన్నారు.

అలాగే పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతుందని,కౌలు రైతులకు సైతం రైతుబంధు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలు కృతజ్ఞలు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పర్శరాములు, గ్రామ శాఖ అధ్యక్షులు మెడ భాస్కర్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుర్రం రాజు గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పంతం సురేష్, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరుగంటి నర్సింలు, గంగి స్వామి,శ్రీనివాస్,కూడలి లక్ష్మణ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగపురి దేవా గౌడ్,విట్టల్ గౌడ్, వంగ శ్రీనివాసరెడ్డి, కే సి రెడ్డి, శీను, వంగ దామోదర్ రెడ్డి, ఎండి ఈదుల్, ఎలుక రాజు,ఏదండి మహిపాల్ రెడ్డి,నాగపురి నర్సాగౌడ్ లచ్చన్న గారి రవీందర్ గౌడ్,వంగా కిషన్ రెడ్డి, అక్కడ తిరుపతిరెడ్డి, మూడికే నారాయణ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ కు కవిత … నేడు కేసిఆర్ తో భేటీ