హమ్మయ్య.. ఏపీలో 'అఖండ' పై అసెంబ్లీ సంఘటన ప్రభావం లేదు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా నిన్న విడుదల అయ్యింది.

ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఏపీ అసెంబ్లీ లో జరిగిన సంఘటనలు కాస్త ఆందోళన కలిగించాయి.

ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మద్య జరిగిన యుద్ద వాతావరణం మరియు బాలకృష్ణ ప్రెస్‌ మీట్ పెట్టి మరీ వైకాపా ను విమర్శించడం వంటి పరిణామాలతో ఏపీలో హడావుడి మామూలుగా లేదు.

ఆ సమయంలో అఖండ విడుదల అవ్వడం వల్ల జరిగే పరిణామాలు ఏంటీ.ఎలా ఉండబోతున్నాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా అఖండ సినిమా కు అక్కడ ఎలాంటి అడ్డంకిని ఎవరు కలిగించలేదు.

టికెట్ల రేట్లు తక్కువ అనే విషయం తప్ప ఏపీలో అఖండకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

దాంతో అఖండ సినిమా ఘన విజయం ను దక్కించుకుంది.అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట కూడా అఖండ విజయంను నమోదు చేసుకుని అఖండ వసూళ్లను దక్కించుకుని అఖండ రికార్డుల దిశగా పరుగులు తీస్తుంది .

"""/" / బాలయ్య కెరీర్ లో దాదాపుగా ఏడు ఎనిమిది ఏళ్లుగా ఇలాంటి ఒక సినిమా సక్సెస్ రాలేదు అంటూ అభిమానులు అంటున్నారు.

బయ్యర్లు ఏపీలో పరిస్థితుల పై కాస్త ఆందోళన వ్యక్తం చేసినా చివరకు పరిస్థితులు అంతా కూడా కూల్‌ అయ్యాయి.

దాంతో అక్కడ వసూళ్లు బాగానే ఉన్నాయి. బోయపాటి మరియు బాలయ్య ల కాంబోలో వచ్చిన ఈ సినిమా హ్యాట్రిక్ గా నిలిచింది.

ప్రగ్యా జైస్వాల్‌ కు చాలా కాలం తర్వాత కమర్షియల్‌ బ్రేక్ దక్కింది.దాంతో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక శ్రీకాంత్‌  కూడా విలన్ గా కుమ్మేశాడు.

దేవి శ్రీ ప్రసాద్ రత్నం సినిమాతో హిట్టు కొడుతున్నాడా..?