ఈ ఏడాది చేపమందు పంపిణీకి బ్రేక్..!

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న కారణంగా ఈ ఏడాది చేపమందు పంపిణీ ఆపేస్తున్నామని ప్రకటించరు బత్తిని హరినాథ్ గౌడ్.

ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చేపమంది ప్రసాద్ ఇవ్వబడుతుంది.జూన్ మొదటి వారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో పాల్గొంటారు.

చాలా విశిష్టత కలిగిన ఈ చేపమంది పంపిణీ ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది.

అయితే ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ ఉండటం వల్ల చేప మందు పంపిణీకి బ్రేక్ పడుతుందని తెలుస్తుంది.

ఈ విషయాన్ని వెల్లడించారు బత్తిని హరినాథ్ గౌడ్.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి చేపమంది ప్రసాద్ ఆపేస్తున్నామని అన్నారు.

ప్రజలెవరు చేపమందు కోసం రావద్దని చెప్పారు.జూన్ 8న చేపమందు ప్రసాదం ఇంట్లో వాళ్లం మాత్రమే తీసుకుంటామని అన్నారు హరినాథ్ గౌడ్.

ఇక నెల్లూరు ఆనందయ్య కరోనా మందుపై కూడా స్పందించారు హరినాథ్ గౌడ్.ఆనందయ్యది పురాతా కాలం నాటి వైద్యమని అన్నారు.

అయితే ఆనందయ్య మందు ఆయుర్వేదం అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు.

ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆనందయ్య కరోనా మందుకి తన మద్ధతు ఇస్తానని అన్నారు బత్తిని హరినాథ్ గౌడ్.

అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?