వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు..: నారా లోకేశ్
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి ఇవాళ్టికి యాభై రోజులు అవుతుందని ఆ పార్టీ నేత నారా లోకేశ్ అన్నారు.
ప్రజల మధ్యకు రాకుండా చంద్రబాబును బంధించారని తెలిపారు.తమకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని లోకేశ్ ప్రారంభించారు.
అమ్మను కూడా అరెస్ట్ చేస్తామని చెబుతున్నారన్న లోకేశ్ ఇది కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు.
వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని తెలిపారు.చంద్రబాబు జైలులో ఉన్న ఫొటోలు ఎలా బయటకు వచ్చాయన్నారు.
జైలుపైన డ్రోన్లు తిరుగుతున్నాయన్న లోకేశ్ చంద్రబాబు ఆరు కిలోల బరువు తగ్గిన మాట వాస్తవమని తెలిపారు.
తమకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని స్పష్టం చేశారు.
అమెరికాలో టిక్ టాక్ షట్ డౌన్..