‘ఎక్కడికెళ్లినా నో ఎంట్రీ’.. ఇండియన్ పాస్‌పోర్ట్‌పై వ్లాగర్ కన్నీళ్లు.. వీడియో వైరల్!

ఇండియన్ పాస్‌పోర్ట్(Indian Passport) పట్టుకుని తిరగడం చాలా కష్టమని ఇప్పటికే చాలా మంది గగ్గోలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓ ట్రావెల్ వ్లాగర్ కన్నీళ్లతో పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఆన్ రోడ్ ఇండియన్’(On Road Indian) అనే పేజీలో ఈ క్రియేటర్ పెట్టిన వీడియో చూస్తే, మన పాస్‌పోర్ట్ గురించి మీరూ బాధపడతారు.

ఎందుకంటే, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలా దేశాలకు వెళ్లడం కష్టమంట.ఆ వీడియోలో, ఆ వ్లాగర్ తన ఇండియన్ పాస్‌పోర్ట్‌ని చేతిలో పట్టుకుని, హిందీలో ఒక మాటన్నాడు.

"ఈ కాగితానికి ఏమాత్రం విలువ లేదు" అని.ఇండియన్ పాస్‌పోర్ట్( Indian Passport) ఉంటే చాలు, వీసా సమస్యలు, అనుమానంగా చూడటం.

ఇవన్నీ కామన్ అయిపోయాయని వాపోతున్నాడు.థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక(Thailand, Malaysia, Sri Lanka) లాంటి దేశాలకు ఈజీగా వెళ్లొచ్చని మన ఇండియన్ పాస్‌పోర్ట్ గురించి గొప్పలు చెప్పుకోకండి బాబూ అంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాడు.

"కష్టమైన దేశాల దగ్గర మన పాస్‌పోర్ట్ ఏమాత్రం పనికిరాదు" అని కుండబద్దలు కొట్టాడు.

"""/" / అసలు విషయం చెప్పడానికి తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాడు.

రీసెంట్‌గా జోర్డాన్(Jordan) దేశంలోకి వెళ్తుంటే, కేవలం ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందని తనని లోపలికి రానివ్వలేదంట.

"హర్ జగహ్ ఎంట్రీ డినైడ్ (ఎక్కడికెళ్లినా నో ఎంట్రీ)" అంటూ విసుక్కున్నాడు.అంతేకాదు, చాలా దేశాలు ఇండియన్స్‌కి వీసా(Visa For Indians) లేకుండా, వీసా ఆన్ అరైవల్ ఆప్షన్స్ తీసేస్తున్నాయని బాధపడ్డాడు.

ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు.ఈజిప్ట్ దేశం ఇప్పుడు ఇండియన్స్ రావాలంటే ఇన్విటేషన్ లెటర్ అడుగుతోందంట.

చైనా అయితే ఇండియన్స్‌కి 24 గంటలు మాత్రమే వీసా లేకుండా ఉండేందుకు పర్మిషన్ ఇస్తుందంట.

అదే వేరే దేశాల వాళ్లయితే 10 రోజుల వరకు ఉండొచ్చంట.ఎంత తేడా చూడండి.

"""/" / తన దగ్గర డబ్బులున్నాయని, కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ఇంతకుముందు చాలా దేశాలు తిరిగిన రికార్డు ఉన్నా కూడా, ఎయిర్‌పోర్ట్‌లో ఆపేస్తున్నారని, ఒక్కోసారి ఎంట్రీనే ఇవ్వడం లేదని వాపోయాడు.

"పాస్‌పోర్ట్ చూడగానే స్టార్ట్ చేస్తారు చెకింగ్.కొన్నిసార్లు అయితే సింపుల్‌గా నో చెప్పేస్తారు" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ వీడియో చూసిన చాలామంది ఇండియన్స్ కనెక్ట్ అయిపోయారు.రెండు రోజుల్లోనే 70 లక్షల వ్యూస్ దాటేసిందంటే మామూలు విషయం కాదు.

ఇండియన్ పాస్‌పోర్ట్‌తో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎంత కష్టమో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, ఇండియా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ ఈ సంవత్సరం 80 నుంచి 85కి పడిపోయింది.

అంటే మన పాస్‌పోర్ట్ పవర్ తగ్గిపోయిందన్నమాట.