‘బిగ్ బాస్’లో ఇక నో ఎలిమినేషన్.. సక్సెస్ అవుతే?

ఏంటి ? బిగ్ బాస్ లో నో ఎలిమినేషన్ ఆహా? కామెడీనా? అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.

కానీ ఇది నిజం.కాకపోతే మన తెలుగులో కాదు హిందీ బిగ్ బాస్ లో.

అవును మీరు విన్నది నిజమే.హిందీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 14లో ఈ కొత్త రకం ఎలిమినేషన్ ని ప్రారంభించనున్నారట.

ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ నిజం అండి.ఇకపై బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఎలిమినేషన్ జరగదు.

అలా ఎందుకు జరగదు అని మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా! హా ఎలిమినేషన్ జరగదు.

కానీ ఓటింగ్స్ కి ప్రాధాన్యత ఉంటుంది.ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవుతారు.

కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్లు బయటకు రారు.బిగ్ బాస్ హౌస్ లోనే కంటస్టెంట్స్ కి కనిపించకుండా ఆ హౌస్ లోనే ఉంటారు.

వారిని ఇన్విజిబుల్ అంటారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికీ ఇన్విజిబుల్ కి ఎలాంటి సంబంధం ఉండదు.

ఇన్విజిబుల్ వారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిని చూస్తారు కానీ వీరు మాత్రం చూడలేరు.

సరికొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అవుతే మిగితా అన్ని భాషల్లోను ఈ ప్రక్రియ అమలు చెయ్యచ్చు.

ఇన్విజిబుల్ పెట్టి ఆ కంటస్టెంట్లను ఏం చేస్తారు? అంటే కేవలం ఎలిమినేట్ మాత్రమే అవుతారట.

మిగితాది అంత బిగ్ బాస్ చెప్పినట్టే చేస్తారట.అలా చెయ్యకపోతే వెంటనే హౌస్ నుంచి బయటకు నెట్టేస్తారట.

నో ఎలిమినేషన్.ఓన్లీ ఇన్విజిబుల్ ప్రక్రియ ఉంటుందని బిగ్ బాస్ సీజన్ 14 హోస్ట్ కండల వీరుడు సల్మాన్ ఖానే స్వయంగా ప్రకటించాడు.

మరి ఈ ప్రక్రియ హిట్ అవుతుందా? బిగ్ బాస్ ఇంకా ఎక్కువ గొడవలు పెడుతాడా? అసలు పెట్టడా? అనేది చూడాలి.

ఏది ఏమైనా బిగ్ బాస్ అంటేనే వెరైటీ.వింత లోకం.

అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.మరి మీరు ఏం అంటారు? .

విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో..!!