ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 86 దరఖాస్తుల రాక
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు.ఆయా శాఖలకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ శాఖకు 34, ఉపాధి కల్పన శాఖకు 3, ఎంపీడీవో తంగళ్ళపల్లికి 8, ఎంపీడీవో ముస్తాబాద్ కు 3, ఎంపీడీవో ఎల్లారెడ్డిపేట కు 1, ఎంపీడీవో కోనరావుపేటకు 2, ఎంపీడీవో బోయినపల్లికి 2, సిరిసిల్ల మున్సిపల్ కు 10, డీఎం అండ్ హెచ్ ఓ 5, ఎస్డిసీకి 3, విద్యాశాఖకు 2, డీఆర్డీఓ, డీడబ్ల్యూఓ, మార్కెటింగ్, టౌన్ ప్లానింగ్, ఎస్పీ ఆఫీస్, మైన్స్, పౌర సరఫరాల శాఖ, ఆర్ అండ్ బీ, ఎంబీ ఇంట్రా, సెస్, డీఎస్ సీడీఓ, కార్మిక శాఖ, జిల్లా దవాఖాన సిరిసిల్ల కార్యాలయాల కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ రోబోను ఆవిష్కరించిన చైనా.. క్రిమినల్స్‌ను పట్టుకుంటుందట..?