ఫ్రీ డేటా, ఫ్రీ ఓటీటీ ఇచ్చినా అంబానీకి నో క్రెడిట్.. ఇది కదా కలికాలం అంటే?

ముకేశ్ అంబానీ( Mukesh Ambani ) పేరు వింటేనే చాలా మందికి కడుపు మంట.

కానీ నిజం చెప్పాలంటే, ఈయన పుణ్యమా అని దేశం మొత్తం డిజిటల్ ప్రపంచంలో దూసుకుపోతోంది.

ఒకప్పుడు డేటా అంటేనే భయపడేవాళ్లం.నెలకు ఒక జీబీ అంటే 100 నుంచి 200 రూపాయలు ఉండేది.

సామాన్యుడికి డేటా అంటేనే లగ్జరీ.అలాంటి రోజులు పోయాయి అంటే కారణం ముకేశ్ అంబానీ.

2016లో జియో( Jio ) పుణ్యమా అని రోజుకి 1-2 జీబీ డేటా.

అది కూడా నెలకి జస్ట్ 199 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.అది చూసి మిగతా టెలికాం కంపెనీలు కూడా షాకయ్యాయి.

వెంటనే వాళ్లు కూడా డేటా ధరలు తగ్గించక తప్పలేదు.అలా అందరికీ మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.

ఇప్పుడు జియో యూజర్ల సంఖ్య అక్షరాలా 44 కోట్లకు పైమాటే.అంటే మామూలు విషయం కాదు.

అంబానీ ఇక్కడే ఆగలేదు.ఓటీటీ రంగంలో కూడా తన మార్క్ చూపించారు.

జియో సినిమా,( Jio Cinema ) హాట్‌స్టార్‌తో కలిసి అదిరిపోయే కంటెంట్ ని తక్కువ ధరకే అందిస్తున్నారు.

నెలకు 199 రూపాయలు కడితే చాలు.మార్వెల్ సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లు.

ఇలా 50కి పైగా యాప్స్‌కు ఫ్రీగా యాక్సెస్ అందిస్తున్నారు. """/" / నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి గ్లోబల్ ఓటీటీలు రేట్లు పెంచుకుంటూ పోతుంటే.

జియో మాత్రం తక్కువ ధరకే అదిరిపోయే కంటెంట్ ఇస్తూ సామాన్యుడికి వినోదాన్ని చేరువ చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే, జియో వల్ల ఊర్లలో కూడా ఇంటర్నెట్ వచ్చేసింది.ఒకప్పుడు నెట్‌వర్క్ లేక అవస్థలు పడ్డ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్, ఓటీటీ సినిమాలు అన్నీ చూస్తున్నారు.

చదువు, వైద్యం, వినోదం.ఇలా అన్ని రంగాల్లోనూ డిజిటల్ విప్లవం వచ్చేసింది.

"""/" / అంబానీ వ్యాపార విధానాలపై ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.జియో మాత్రం దేశంలో డిజిటల్ శకాన్ని మార్చేసిందనేది మాత్రం నిజం.

డిజిటల్ ప్రపంచంలో వెనుకబడిపోతామనుకున్న ఎంతోమందికి కొత్త అవకాశాలు కల్పించింది.నిజంగా చెప్పాలంటే, ముకేశ్ అంబానీ ఇండియా డిజిటల్ ఫ్యూచర్‌ని రీడిఫైన్ చేశారు.

జియో ద్వారా కనెక్టివిటీని ఈజీ చేయడమే కాకుండా.తక్కువ ధరకే క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించడంలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.ఆయనే ఇండియా డిజిటల్ భవిష్యత్తుని మలుపు తిప్పిన వ్యక్తి అని చెప్పొచ్చు.

వైరల్ ఫోటో: రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం వేసిన అభిమాని