కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది.ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానంను ప్రవేశపెట్టారు.

అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు స్పీకర్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు.

కాగా మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇండియా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?