బోయినపల్లి ఎంపీపీ పై విగిన అవిశ్వాసం .

రాజన్న సిరిసిల్ల జిల్లా:బారాస పార్టీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు పర్లపెల్లి వేణుగోపాల్( Parlapelli Venugopal ) పై ఇటీవల పెట్టిన అవిశ్వాస తీర్మానం సభ్యులు హాజరు కాకపోవడంతో వీగిపోయింది.

సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎంపిపి పై అవిశ్వాస ప్రతిపాదనను వేములవాడ ఆర్డీవో మధుసూదన్ కు జనవరి 29 న అందించారు.

ఈ మేరకు ఆర్డీవో ఫిబ్రవరి అయిదు న ఎంపీటీసీ( MPTC ) సభ్యులకు ఆర్డీవో నోటీసులు జారీ చేయగా బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఎంపిటిసి లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంతో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ చాకచక్యంగా వ్యవహరించి తన పదవిని నిలబెట్టుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పై వచ్చిన అవిశ్వాసం పై ఆర్డీవో మధుసూదన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి మండల ఎంపీటీసీ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం విగిపోయినట్లు ఆర్డీవో మధుసూదన్ తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో జయశీల, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక.. వైరల్ అవుతున్న మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు!