కేసిఆర్ లిస్ట్ లో వారికి నో ఛాన్స్ !
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి.
ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్( BRS Party ) హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉండగా బిఆర్‌ఎస్ తరుపున నిలిచే గెలుపు గుర్రాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో 100 కు పైగా స్థానాలు సాధించాలని గులాబీ బాస్ టార్గెట్ పెట్టుకున్నారు, అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు కేసిఆర్.
"""/" /
సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రజా మద్దతు లేని వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని గతంలోనే చెప్పుకొచ్చారు.
అయితే కొంత మంది ఎమ్మేల్యేలు( MLA ) అవినీతికి పాల్పడుతున్నారని వారు పద్దతి మార్చుకోకపోతే సీటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అయితే అవినీతికి పాల్పడుతున్న ఆ ఎమ్మేల్యేలు ఎవరనేది కేసిఆర్ బహిర్గతం చయలేదు.ఇక ఇప్పటికే నియోజిక వర్గాల వారీగా సర్వే చేయించిన కేసిఆర్( CM Kcr ) బరిలో నిలిచే అభ్యర్థుల మొదటి జాబితాను కూడా సిద్దం చేసారట.
కాగా సర్వేల ఆధారంగానే దాదాపు 95 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు కేటాయించతున్నారని టాక్.
"""/" /
అంటే 119 స్థానాలకు గాను 112 స్థానాల్లో పాత వారినే బరిలో దించబోతున్నారట మిగిలిన ఏడు స్థానాల్లో మార్పులు తప్పవని కేసిఆర్ భావిస్తున్నారట.
ముఖ్యంగా ఉమ్మడి ఖరీంనగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కొన్ని నియోజిక వర్గాల్లో కొత్తవారిని బరిలో దించబోతున్నారట.
దీంతో కేసిఆర్ లిస్ట్ లో లేని ఆ ఏడుగురు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో అవినీతికి పాల్పడుతున్నారని కేసిఆర్ చెప్పిన ఎమ్మేల్యేలు వారెనా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇక మొదటి అభ్యర్థుల లిస్ట్ ను ఈ రెండు మూడు రోజుల్లో కేసిఆర్ ( CM Kcr )వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరి గెలుపే లక్ష్యంగా ఉన్న కేసిఆర్ కు ఈసారి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.