నల్లగొండ లోక్ సభ బరిలో హస్తం అభ్యర్ధి ఎవరూ…?

నల్లగొండ జిల్లా:నల్లగొండ లోక్ సభ( Nalgonda Lok Sabha ) స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచే అభ్యర్ధి ఎవరనే దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ప్రధానంగా నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి( Raghuveer Reddy Kunduru ), సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొందని హస్తం పార్టీలో చర్చ జరుగుతుంది.

అయితే వీరిద్దరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులు కావడంతో టికెట్ ఎవరికి వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

గతంలో సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి( Patel Ramesh Reddy )కి నల్గొండ ఎంపి టికెట్ రేవంత్ రెడ్డి ఆఫర్ చేసినట్టు ఏఐసీసీ నుండి వచ్చిన దూతలు చెప్పి ఆయన నామినేషన్ ఉపసంహరించారు.

పార్టీ పెద్దలే మాటిచ్చారు కాబట్టి ఆయనకు వెనక్కి తగ్గారు.ఇదిలా ఉంటే కుందూరు రఘువీర్ రెడ్డి( Raghuveer Reddy Kunduru ) నల్గొండ ఎంపి టికెట్ తనదేనని, కింది స్థాయిలో తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.గతంలో జానారెడ్డి కూడా పలు సందర్భాల్లో అవకాశం వస్తే నేను కూడా నల్గొండ నుండి ఎంపిగా పోటీ చేయవచ్చన్న సందర్బాలు చాలా ఉన్నాయి.

దీంతో కొడుకు టికెట్ కోసం మరెవరూ పోటీకి రాకుండా ఉండడానికి అలా అని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా నల్గొండ ఎంపి టికెట్ ఎవరిని వరిస్తుందో అన్న విషయం రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు తెర లేపుతుంది.

ఇక అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.!.

చిరంజీవికి ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా.. ఏంటో తెలుసా?